గులాబీ లాంటి పువ్వు (పేరు తెలియదు)

ఓ నాలుగు ఏళ్ల క్రితం షాపు (Sams Club) లో spring time లో దుంపలు అమ్ముతుంటె పట్టుకొచ్చి ఇంటిముందు పాతా, ప్రతి ఏడు మొక్కలు రావటం ఆ దుంపలనుండి, కొద్దినెలలు పెరిగి ఎదో తెగులు లాంటిది వచ్చి ఎండిపోవటం, పువ్వులు పూయకపోవటం జరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం మొక్క ఏపుగా పెరిగి ఆ దుంపలనుండి, పూలు కూడా పూశాయి. ఆ చిత్రాలే ఇక్కడ.

నేను నా చేతులల్తో పాతిన దుంపలనుండి వచ్చిన మొక్క(లు), వాటి పూలు కాబట్టి కొంచం ఆనందం ఎక్కువగానే ఉంది :)
పువ్వుతో కలసిన మొక్క


పువ్వు



పువ్వు closeup, దానిలో వర్షం నుండి తలదాచుకొంటున్న బుల్లి మిత్రుడు


Flower Closeup with raindrops 


అక్కడక్కడా నల్ల మచ్చలు కనిపిస్తాయి (జాగ్రత్తగా) గమనిస్తే, పాపం ఆ మచ్చలు పూలవి మాత్రం కాదు, అయిదు ఏళ్ల పైగా క్లీనింగుకు నోచుకోని నా కెమెరా sensor మచ్చలు :(

నా వరకు అయితే  2nd, 4th  pics బాగా వచ్చాయేమో అనిపించింది పై నాలుగిటిలో (కాకి పిల్ల కాకికి ముద్దు కదా :) ) , మీరేమంటారో చెప్పండి.

Comments

  1. వీటిని 'పియోనీ'లంటారు (peonies).
    ఇంకా చాలా రంగులుంటాయి, కానీ మాఇంట్లోనూ ఇదే రంగు. ప్రతి ఏటా అదే వస్తూంటుంది.

    ReplyDelete
  2. దుంపల నుంచి వచ్చిన మొక్కలంటే.... గులాబీలేనంటారా? ఏవైతే ఏం లే గానీ పువ్వులు మాత్రం అందాలొలికిస్తున్నాయి. మచ్చల వల్ల పువ్వుకి కొత్త అందం వచ్చింది లెండి! :-))

    నా వోటూ 2, 4 ఫొటోలకే!

    ReplyDelete
  3. బావున్నాయండి , బాగా ముద్ద గా పూసిన గులాబీ లాగా ఉన్నాయి !

    ReplyDelete
  4. @Rajesh, Thanks

    @నాగేశ్వర రావ్ గారు, వీటి పేరు చెప్పి మంచి పని చేసారు. ఇవి ఎందుకు నాలుగు ఏళ్లనుండి పూయటం లేదో అన్నదానికి సమాధానం దొరికింది వీటి పేరు తెలియటం వలన. వీటికి కనీసం 40 కంటే తక్కువ టెంపరేచరు నెల పైగా ఉండాలంట అదీగాక డల్లాస్ లో ఎక్కువగ పూయవు అని తెలిసింది. బహుశా ఈ ఏడాది చలి ఎక్కువగా ఉండటం, మంచు కూడా మామూలు కంటే ఎక్కువసార్లు పడటం కారణం అయ్యివుంటుంది ఈ కాసిని అయినా పూయటానికి. దానికి తోడు నేను దక్షిణం వైపు వీటిని పాతాను, అది కూడా ఓ కారణం అంటున్నారు, ఓ Orborist.

    @సుజాత గారు, మచ్చ మంచిదేనంటారు ఫోటోలకు :), Thanks

    @శ్రావ్య, అవును ఇవి ముద్ద గులాబీల లాగా ఉండి పూసిన నాలుగురోజులు చాలా అందంగా ఉంటాయి, కాకపోతే ఇక్కడ డల్లాస్ లో పెద్దగా పూయవు కాని, బోస్టన్ లాంటి ప్రాంతాలలో గుత్తులు గుత్తులు పూయటం చూసాను.

    ReplyDelete

Post a Comment