Purple Beauty





Comments

  1. వీటిని గడ్డిపూలంటారా ? నాకు బిళ్ళ గన్నేరు అని కూడా అంటారనుకుంటానండీ !

    ReplyDelete
  2. వీటి పేరు నాకు తెలియదండి. ఇంటిముందు landscaping లో ఇక్కడ వాడతారు, పేరు తెలియనివి, చిన్న చిన్న పొదలకు ఉండేవి అన్నీ నాకు గడ్డి పూలే :). పేరు మార్చుతున్నా. చూద్దాం ఇంకెవరైనా వెరే పేరెమయినా చెబుతారేమో.

    ReplyDelete
  3. హ హ సరిపోయింది , నాకు కూడా అంతగా తెలియదు కాని ఆ పువ్వులు అలా అనిపించాయండీ , కాని ఇప్పుడు చూస్తుంటే ఆ ఆకులు అలా ఉండవు అనిపిస్తుంది :) విజయమోహన్ గారు చూస్తే కరెక్టు గా చెప్పగలరు అనుకుంటా .

    Btw Please remove the word verification.

    ReplyDelete
  4. ఆకులు మనవైపు ఉండే సరికి చెట్టు ఆకులులాగా ఉండి, ముళ్ళు లేవు, ఈ పొద ఓ అడుగు కంటే ఎత్తుగా పెరగటం చూడలేదు. 365 రోజులు ఆకులు మాత్రం పచ్చగానే ఉన్నాయి (మంచు పడినప్పుడు కూడా). ఈసారి ఏ homedepot కో వెళ్ళినప్పుడు శాస్త్రీయనామం ఎమయినా దొరుకుంతుందేమో చూడాలి :)

    wordverification తీసివేసాను.

    శ్రోతలు (అచ్చుతప్పు) కాదు కాదు పాఠకుల కోరికపై, విజయమోహన్ గారు ఎక్కడున్నా హాజరు కావాలని సభాముఖంగా (మళ్ళీ అచ్చుతప్పు, తెలుగు సంఘం మీటింగులకు వెళ్లటం తగ్గించాలి) కాదు కాదు బ్లాగు ముఖంగా అభ్యర్ధిస్తున్నాం :)

    ReplyDelete
  5. సాధారణంగా ఈ సమయంలో అంతర్జాలంలో విహరించను.మీరు పిలిచినందువల్లనేనేమో ఇలా వచ్చాను.నాపైన నమ్మకముంచినందుకు ముందుగా ధన్యవాదాలు.పైన చూపించినవి బిళ్ళగన్నేరు మాత్రం కాదు.వాటిని నేను ఎప్పుడూ చూడలేదు.బిళ్ళ గన్నేరును ఈ క్రింది లంకెలో చూడండి,మీ కోసం ఇప్పుడు ప్రచురించాను.చిత్రాలు సరిగ్గా రాలేదు,క్షమించాలి.
    http://chilamakuru.blogspot.com/2011/04/blog-post.html

    ReplyDelete
  6. విజయమోహన్ గారు,
    నా కామెంట్ మీరు చూసి ఉండరు, పాత టపా కాబట్టి, చూసే అవకాశం లేదనుకున్నా గాని, మీరు చూసి ఇలా ఫొటో తో సహా బిళ్ళ గన్నేరు ను పెట్టటం ఆశ్చర్యంతో కూడిన ఆనందం. అంతా క్రిష్ణ మాయ.

    ఇవి నేను కొంత కాలమున్న చీరాల చుట్టుప్రక్కల wildflower గా బంజరు/ఇసుక భూములలో ఉండేవి, స్థానిక యానాదులు వైద్యానికి పనికివస్తాయి అని ఎవరో కొంటూ వుంటే, వాటిని వేళ్లతో సహా ముఖ్యంగా తెల్ల పూల మొక్కలను పీకేసి అమ్ముతుంటే, మా సైన్స్ మాస్టారు, అలా పీకొద్దురా ఆ తర్వాత కావాలన్న పొలాలలో, గట్ల వెంబడ ఉండవు, మంచి మొక్కలు రా అవి, అని గోల పెట్టేవారు.

    ఆ జ్ఞాపకాలన్నీ గురుతుకు వచ్చాయి, ఇప్పుడు చచ్చిన దేముడు గారు వానపిక్కు పేరుతో ఆ తీర ప్రాంతాన్నతా పందారం చేసేసారు అనుకోండి :(

    ReplyDelete
  7. హ హ కృష్ణ గారు హ హ మాయే ! నేను విజయమోహన్ గారిని ఒకసారి ఇక్కడ చూడమని వారి బ్లాగులో కామెంట్ రాసానండి అదీ విషయం :)

    ఇక మీరు పెట్టిన పేరే కరెక్ట్ నేను తప్పు దారి పట్టించా క్షమించాలి .

    విజయ మోహన్ గారు ధన్యవాదాలు ! ఫొటోలతో, మిగిలిన వివరాలతో సహా పోస్టు పెట్టినందుకు . అవును ఇపుడు చూస్తె తేడా స్పష్టం గా తెలుస్తుంది . (ఈ కామెంట్ మీ పోస్టులో బ్లాగులో పెట్టడానికి ట్రై చేశా కాని తీసుకోవటం లేదు ఎందుకనో )

    ReplyDelete
  8. క్రిష్ణ మాయ కాదు, అంతా శ్రావ్య మాయేనంటారు, ఒప్పుకొంటున్నా :) మీరు తప్పు కాదు, ఆ పూలు దగ్గరగానే ఉన్నాయి, విజయమోహన్ గారు అంత కష్టపడి బిళ్ల గన్నేరు ఫోటో లతో సహా పేడితే, నేను పెట్టిన పూల ను, ఊరుపేరు లేకుండా వదిలేస్తే ఎలా అని, దగ్గరలోని store కి వెళ్లి, ఈ మొక్క పేరు పట్టుకొచ్చా. దీని పేరు వాళ్లు వ్రాసింది Purple Beauty Creeping Phlox (Flox musgoso Purple Beauty / Phlox subulata ) అని.

    వీటికి సంభందించిన ఓ లింకు http://www.premiumplantplugs.com/Phlox-subulata-Purple-Beauty-p695.html

    ప్రస్తుతానికి టపా పేరు Purple Beauty అని మారుస్తున్నా, ఎవరయినా వచ్చి పింక్ రంగు వాటిని పట్టుకొచ్చి Purple అంటావేమిటి, అంటే అప్పుడేమిచెప్పాలో ఆలోచిద్దాం!!

    ReplyDelete
  9. హ హ కృష్ణ గారు ;) Thanks for the link ! అది purple లే లెండి పింక్ కాదు !
    మీకు , విజయమోహన్ గారికి ఇద్దరికీ మరో సారి ధన్యవాదాలు !

    ReplyDelete
  10. పువ్వులు చాలా బాగున్నాయండీ...

    nice pictures.

    ReplyDelete
  11. గీతిక గారు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment